46 ఏళ్ల తర్వాత తెరచుకోనున్న పూరీ జగన్నాథ ఆలయం నిధి…

Puri Jagannath Temple To Be Opened After 46 Years,Temple To Be Opened After 46 Years,Puri Jagannath Temple,Temple To Be Opened After 46 Years,Opened After 46 Years,Temple Opened After 46 Years,Temple,Odisha, Puri Temple, Puri Rathayatra,Ap,Tdp,Ycp,Lok Sabha Elections, Ap Live Updates, Ap Politics, Political News, Mango News, Mango News Telugu
Puri Jagannath Temple, puri temple, odisha, puri rathayatra

ఒడిశాలోని పూరీ లోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ని ఆభరణాల గదిని ఎట్టకేలకు తెరవబోతున్నారు. జులై 14 ఆదివారం భాండారాన్ని తెరవాలని ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. 46 సంవత్సరాల తర్వాత నిధి ఉన్న గదిని తెరవబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ ఇప్పుడు ఆ మేరకు రంగం సిద్దం చేసింది. 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. మోహన్ చరణ్ ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు. పూరీ జగన్నాథుని ఆలయ తలుపులు తొలగించడం, ఆభరణాల గది తెరుస్తానని బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. హామి ఇచ్చినట్లుగానే జూన్ 13న ఆలయంలోని నాలుగు తలుపులు తెరిచారు. ఇప్పుడు మరో హామీని కూడా నెరవేర్చ బోతున్నారు.  జులై 14 లోగా ఆలయ ఖజానా లోపలి గదిని తెరవాలని ముఖ్యమంత్రి చరణ్ మాజి  ఆదేశించారు. రిపోజిటరీ ని చూస్తున్న అత్యున్నత స్థాయి కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

1978లో చివరిసారిగా స్టోరేజీ గదిని తెరిచారు. దీని తర్వాత, గదిని తెరవాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పై చాలాసార్లు ఒత్తిడి తెచ్చారు, అయితే తాళం చెవి పోయినందున ఆ గదిని ఎవరు తెరవలేకపోయారు. అయితే అప్పటి నుంచి బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల్లో ప్రధానంగా ఎత్తి చూపుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు బీజేపీ అధికారంలోకి రావడంతో హామీ ఇచ్చినట్లుగానే నిధిని తెరవబోతున్నారు.

ఈ స్టోర్‌హౌస్‌లో పురాతన బంగారు మరియు వజ్రాల ఆభరణాలు, విలువైన రత్నాలు మరియు రాళ్లు, వెండి పాత్రలు మరియు విలువైన ఆభరణాలు ఉన్నాయి. 120 కిలోల కంటే ఎక్కువ బంగారం మరియు 221 కిలోల వెండిని కలిగి ఉందని చెబుతారు, ఇవన్నీ జగన్నాథుడు, బలభద్ర మరియు సుభద్ర త్రిమూర్తులకు చెందినవి. చాలా వరకు ఆభరణాలు మరియు ఆభరణాలు పురాతనమైనవి కాబట్టి ఈ నిధికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. క్రీ.శ.1466 లో గజపతి కపిలేంద్ర దేబ్ భారీ మొత్తంలో బంగారం మరియు ఆభరణాలను విరాళంగా ఇచ్చాడని ఆలయంలోని ఒక గ్రంథం చెబుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE