‘భారత ఒలింపిక్ సంఘం’ అధ్యక్షురాలిగా ఎన్నికైన దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష, తొలి మహిళగా ఘనత

Legendary Athlete PT Usha Elected as The First Woman President of Indian Olympic Association,Legendary Athlete PT Usha,PT Usha Elected as President of IOA,PT Usha,Indian Olympic Association,President of Indian Olympic Association,Mango News,Mango News Telugu,Indian Olympic Association President,President Indian Olympic Association,Indian Olympic Association President PT Usha,PT Usha Latest News And Updates,PT Usha News And Live Updates,P. T. Usha Olympics

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష ఎన్నికయ్యారు. డిసెంబర్ 10న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. నామినేషన్ల దాఖలుకు ఆదివారం తుది గడువు కాగా, అధ్యక్ష పదవికి 58 ఏళ్ల ఉష ఒక్కరే నామినేషన్‌ వేశారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఐఓఏ ఉపాధ్యక్ష పదవి పురుషుల కేటగిరికి సంబంధించి మాజీ షూటర్‌, ఒలింపిక్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌ ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. దీనికి కూడా ఆయన ఒక్కరే నామినేషన్‌ వేశారు. ఇక మరో ఉపాధ్యక్ష పదవికి మహిళల కేటగిరిలో రాజలక్ష్మి సింగ్‌, అలకనంద అశోక్‌ ఇద్దరు పోటీపడుతున్నారు.

కాగా పీటీ ఉష ఐఓఏ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికవడం విశేషం. నవంబరు 26న ఉష ఐఓఏ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం తెలిసిన విషయమే. ఉష మద్దతుదారులు 14 మంది వివిధ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఆసియా క్రీడల్లో పలు పతకాలు సాధించిన ఉష, 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా, ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించారు. కేరళకు చెందిన ఉష.. తన 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో 100కి పైగా పతకాలు గెలుచుకోవడం విశేషం. ఈ ఏడాది జూలై 6న ఆమెను ప్రధాని మోదీ బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =