ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం

Laureus World Breakthrough, Laureus World Breakthrough of The Year Award, Mango News, Neeraj Chopra, Neeraj Chopra Nominated For Laureus World Breakthrough, Neeraj Chopra Nominated For Laureus World Breakthrough of The Year, Neeraj Chopra Nominated For Laureus World Breakthrough of The Year Award, Olympic champion Neeraj Chopra, Olympics, Olympics Gold Medalist, Olympics Gold Medalist Neeraj Chopra, Olympics Gold Medalist Neeraj Chopra Nominated For Laureus World Breakthrough of The Year Award, World Breakthrough of The Year Award

భారతదేశం తరపున టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు నీరజ్ చోప్రా. తాజాగా, నీరజ్ బుధవారం ప్రతిష్టాత్మక లారస్ ‘వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ విభాగంలో షార్ట్ లిస్ట్‌లో కనిపించిన మొదటి భారతీయుడిగా అతను గుర్తింపు పొందాడు. 23 ఏళ్ల చోప్రా గత ఏడాది తన రెండవ ప్రయత్నంలో 87.58 మీటర్ల త్రోతో టోక్యోలో వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్‌ మొదటిగా గెలిచిన రెండవ భారతీయుడు అయ్యాడు. ఈ అద్భుత ప్రదర్శనతో నీరజ్ చోప్రా భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు.

ది లారస్ అకాడమీ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. “గ్రామీణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో మొదలైన నా ప్రయాణం ఒలింపిక్స్ వరకు చేరడం గొప్ప విషయం. నేను చిన్నప్పటి నుండి ఫిట్‌గా ఉండటానికి క్రీడలను ఎంచుకున్నాను. అయితే, ఈ క్రమంలో ఒలింపిక్ పోడియం వద్ద అగ్రస్థానంలో నిలవడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే ఒక అదృష్టం. అంతేకాక, ప్రపంచ వేదికపై భారతదేశం తరపున పతకం సాధించడం ఇంకా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు లారస్ నుండి ఈ గుర్తింపు పొందడంతోపాటు అసాధారణమైన అథ్లెట్ల సరసన నిలవడం నిజంగా ప్రత్యేకమైన అనుభూతి” అని చోప్రా తెలిపాడు. అతను ఇప్పుడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరియు రెజ్లర్ వినేష్ ఫోగట్ తర్వాత లారస్ నామినేషన్ పొందిన మూడవ భారతీయుడుగా నిలిచాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =