కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ స్థానాన్ని వదులుకోనున్నారు?.. రాయ్‌బరేలీని వదిలేస్తారా? వయనాడ్‌ను వదిలేస్తారా?.. ఆ స్థానాన్ని వదులుకునే విషయంలో రాహుల్ గాంధీ ఎటు తేల్చుకోలేకపోతున్నారా?.. ప్రస్తుతం ఈ ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశగా మారాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు పార్లమెంట్ స్థానాల నుంచి బరిలోకి దిగారు. కేరళలోని వయనాడ్ నుంచి.. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించారు. రెండు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి మెజార్టీ వచ్చింది.
వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తారని ముందు నుంచి వార్తలు వచ్చాయి. రాయ్‌బరేలీ లేదా అమేఠీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కేవలం తమ అభ్యర్థుల తరుపున విస్తృత ప్రచారంపైనే ప్రియాంక గాంధీ దృష్టి పెట్టారు. ఈక్రమంలో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ ఇప్పుడు ఒక స్థానాన్ని రాహుల్ గాంధీ వదలుకోవాల్సి ఉంది. ఒక వ్యక్తే రెండే స్థానాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేనందున.. రాహుల్ ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంది.
అయితే రాహుల్ గాంధీ ఆ రెండు స్థానాల్లో దేనిని వదులుకుంటారనే దానిపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వాయనాడ్ స్థానాన్నే వదులుకోవాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఇటీవలవ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే. సుదాకరన్ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ కేవలం వాయనాడ్‌కు మాత్రమే పరిమితం కావాలని తాము అనుకోట్లేదని చెప్పుకొచ్చారు. అందుకే రాహుల్ ఏ నిర్ణయం తీసుకున్నా బాధపడమని.. ఆయన నిర్ణయాన్ని అర్థం చేసుకొని ఎప్పటిలాగే అండగా ఉంటామని వెల్లడించారు.
సుధాకరన్ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ వాయనాడ్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ ఆ స్థానాన్ని వదులుకుంటే ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. ఈక్రమంలో ఉప ఎన్నికల్లో తన సోదరి ప్రియాంక గాంధీని బరిలోకి దించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారట. అటు ప్రియాంక గాంధీ కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే గెలుచుకున్న సీటు కావడంతో.. ఉప ఎన్నికల్లో కూడా గెలుపు సునాయాసం అవుతుందని భావిస్తున్నారట. త్వరలో దీనిపై రాహుల్ గాంధీ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE