రాజ్యసభ ఎంపీ అమ‌ర్‌సింగ్ క‌న్నుమూత‌

Amar Singh Passes Away, Former SP Leader Amar Singh, Former SP Leader Amar Singh Passes Away, MP Amar Singh Passes Away, national news, Rajya Sabha MP Amar Singh, Rajya Sabha MP Amar Singh Passes Away

రాజ్యసభ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమర్ సింగ్, గత కొన్ని నెలలుగా సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలతో పాటుగా, జాతీయస్థాయిలో అమర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. సమాజ్ వాదీ పార్టీ జనరల్ సెక్రెటరీగా పార్టీకి కీలక సేవలనందించారు. పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటుగా, బాలీవుడ్ సినీ ప్రముఖులతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. అమర్ సింగ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu