రాజీనామాలపై స్పీకర్ దే నిర్ణయం, సుప్రీం కోర్టు తీర్పు

BS Yeddyurappa says SC Decision Victory of Constitution, Karnataka Rebel MLAs Resignations, Mango News, SC rules trust Vote valid Gives Speaker Power to decide on rebel MLAs Resignations, SC Says Speaker Free to Decide on Resignations, Speaker Free to Decide on Resignations But 15 Rebel MLAs, Supreme Court Verdict On Karnataka Rebel MLAs Resignations

కర్ణాటక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, అసమ్మతి నేతల రాజీనామాలపై ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఒక స్పష్టత వచ్చింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల మరియు స్పీకర్ రమేష్ కుమార్ పిటిషన్లపైనా నిన్న వాదనలు విన్న సుప్రీం కోర్టు బుధవారం నాడు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై పూర్తి నిర్ణయాధికారం స్పీకర్ దే అని, ఆ అంశాన్ని రమేష్ కుమార్ కే వదిలేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది, మరో వైపు గురువారం జరగబోయే బలపరీక్షకు వెళ్ళడం, వెళ్ళకపోవడం అనేది ఎమ్మెల్యేల ఇష్టం అని కోర్టు తీర్పులో వెల్లడించింది.

గురువారం నాడు కుమారస్వామి ప్రభుత్వం శాసనసభలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతుంది, ఈ తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యేలు యే విధంగా స్పందిస్తారో అని నేతలు ఆసక్తిగా చూస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, సంకీర్ణ ప్రభుత్వం తిరుగుబాటు ఎమ్మెల్యేల పై జారీ చేసిన విప్ పరిగణన లోకి రాదు కాబట్టి, రాజీనామాలపై పూర్తి నిర్ణయాధికారం స్పీకర్ కే ఇవ్వడంతో, పరిస్థితులను బట్టి వారిపై స్పీకర్ అనర్హత వేటు కూడ వేసే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. తీర్పు పై స్పీకర్ స్పందిస్తూ రాజీనామాలపై ఇక ఆలస్యం ఉండదని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటానన్నారు. బలపరీక్షలో పాల్గొనే విచక్షణాధికారం తిరుగుబాటు ఎమ్మెల్యేలకే ఉండడంతో, కుమారస్వామి బలపరీక్ష పై ప్రభావం పడనుంది, ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడ ఉన్నాయని నేతలు భావిస్తున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=MvShiidKraU]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 12 =