
హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన భారీ డ్రగ్స్ రాకెట్‌తో టాలీవుడ్ షేక్ అయ్యేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు.ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు నటుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్టు అవడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం అమన్ పోలీసులు కస్టడీలో ఉన్నాడు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ పోలీసులతో కలిసి రాజేంద్రనగర్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో కొంతమంది డ్రగ్స్ అమ్మేవారితో పాటు కొనుగోలుదారులు కూడా దొరికిపోయారు.
అయితే డ్రగ్స్ కొనుగోలుదారులలో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఒకరిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ రైడ్ లో అతని వద్ద నుంచి నార్సింగ్ పోలీసులు దాదాపు 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధం ఉందని.. 18 మంది మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో అమన్ ప్రీత్ సింగ్ ని ఏ- సిక్స్ గా కేసును నమోదు చేశారు.
అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు ఉండగా.. వీళ్ల నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 13 మందికి డ్రగ్ టెస్ట్ లు నిర్వహించగా .. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. అలా పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఉండటంతో టాలీవుడ్ షేక్ అవుతుంది. పాజిటివ్ వచ్చిన వారిలో అమన్ తో పాటు.. ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ ఉన్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన పెడ్లర్ల లో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్స్, నోహిమ్లతో పాటు లోకల్ పెడ్లర్లు అల్లం గౌతం, వరుణ్ కుమార్, మహబూబ్ షరీఫ్ పోలీసుల అదుపులో ఉండగా.. కీలక నిందితుడు ఎబుకా మాత్రం పరారీలో ఉన్నాడు. నార్సింగి డ్రగ్స్ కేసులో ఈ ఐదుగురు నిందితులకు 14 రోజుల డిమాండ్ విధించారు. జులై 30 వరకు వీరికి ఉప్పరపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఆ ఐదుగురు నిందితులను నార్సింగి పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు దీనికి రాజకీయ కోణం కూడా అంటుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వినిపించినా.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. దీనికి గత ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రి కారణమని, అతనితో రకుల్ కు ఉన్న పరిచయం వల్ల అప్పట్లో ఆ కేసును పక్కకు పెట్టారని..మళ్లీ ఇప్పుడు కావాలనే సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును తిరగదోడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అవసరం అయితే రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేసి ఆ మంత్రిని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE