టర్కీ,సిరియా భూకంపం: 15,000 దాటిన మృతుల సంఖ్య , శిథిలాల కింద కొనసాగుతున్న అన్వేషణ

Turkey-Syria Earthquake Over 15000 People Lost Lives Ongoing Rescue Operation Under The Rubble,Earthquake in Turkey,Turkey and Cyria,Turkey Earthquake 2023,Antakya Turkey Earthquake,Biggest Turkey Earthquake,Istanbul Turkey Earthquake Today,Mango News,Mango News Telugu,Kusadasi Turkey Earthquake,Last Turkey Earthquake,Turkey Biggest Earthquake,Turkey Earthquake,Turkey Earthquake 2022,Turkey Earthquake 2023 News,Turkey Earthquake Latest News,Turkey Earthquake News,Turkey Earthquake Prediction,Turkey Earthquake Reason,Turkey Earthquake Risk Map,Turkey Earthquake Time Today,Turkey Earthquake Today,Turkey Istanbul Earthquake Today,Turkey Latest Earthquake

టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇప్పటివరకు ఈ భూప్రళయంలో మృతి చెందిన వారి సంఖ్య 15,000 దాటింది. సోమవారం నాటి భూకంపం కారణంగా టర్కీలో 12,391 మంది, సిరియాలో 2,992 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే సహాయక చర్యలు చేపట్టి 72 గంటల సమయం దాటినందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటి మూడు రోజుల్లోనే భూకంపం నుంచి బయటపడిన వారిలో 90 శాతం మందికి పైగా రక్షించబడ్డారని టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అధికారులు వెల్లడించారు. ఎందుకంటే, మొదటి 72 గంటలు రెస్క్యూ ఆపరేషన్‌లకు చాలా కీలకం. కూలిపోయిన భవనాల కింద ఇరుకున్న వ్యక్తులకు రక్తస్రావం నిరోధించడానికి వైద్య సహాయం అవసరం. అందునా ప్రస్తుతం టర్కీలో గడ్డకట్టే ఉష్ణోగ్రతల కారణంగా మూడు రోజుల తర్వాత వారిని గుర్తించినా ప్రాణాలు నిలబెట్టడం కష్ట సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. అలాగే వారికి ఇప్పటికీ ఆహారం మరియు నీరు అందని పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండటం అసాధ్యం అని వారు వివరిస్తున్నారు.

ఇక టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ బుధవారం అత్యంత కష్టతరమైన ప్రదేశాలలో ఒకటైన భూకంప కేంద్రం కహ్రామన్మరాస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలోనే ఇది అత్యంత విషాదంగా అభివర్ణించారు. అయితే ఈ ఆపత్కాలంలో రెస్క్యూ టీమ్‌లు సామర్ధ్యానికి మించి సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. కాగా సిరియా మొదటిసారిగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుండి సహాయం కోరింది. ఈయూ తన సివిల్ ప్రొటెక్షన్ మెకానిజం ద్వారా రెండు దేశాలకు అదనపు అత్యవసర సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చింది. దీనిలో భాగంగా 6.5 మిలియన్ యూరోల విలువైన అత్యవసర సహాయాన్ని అందజేస్తుందని తెలిపింది. మరోవైపు టర్కీలో దాదాపు 3,000 మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల నుంచి సహాయం కోరుతూ వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కాల్స్ చేస్తున్నారు. ఇక ప్రధాని మోదీ హామీ మేరకు ‘ఆపరేషన్ దోస్త్’ కింద, భారతదేశం టర్కీ మరియు సిరియాకు సహాయ సామగ్రి, శోధన మరియు రెస్క్యూ బృందాలు, ఫీల్డ్ హాస్పిటల్, మందులు మరియు పరికరాలను పంపించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 19 =