రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్

Coronavirus, coronavirus national news, Mahant Nritya Gopal Das, national news, Ram Janmabhoomi Trust Chief, Ram Janmabhoomi Trust Chief Mahant Nritya Gopal Das, Ram Janmabhoomi Trust Chief Mahant Nritya Gopal Das Tested Positive, Ram Janmabhoomi Trust Chief Tested Positive, Ram Temple Trust Head Tests Covid Positive

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్ పర్సన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన అస్వస్థతకు గురవడంతో పరీక్షలు నిర్వహించగా, గురువారం నాడు కరోనా పాజిటివ్ గా తేలినట్టు పేర్కొన్నారు. ఆగస్టు 5న అయోధ్యలో నిర్వహించిన రామమందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురితో ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ వేదికను పంచుకున్నారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి, మెరుగైన చికిత్స కోసం గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించమని ఆదేశాలు ఇచ్చినట్టుగా మధుర జిల్లా మేజిస్ట్రేట్ రామ్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి ఉందని మేజిస్ట్రేట్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu