ఈ మధ్య కాలంలో పలు రాష్ట్రాలలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తూ వస్తుంది. మొన్ననే జమ్ము కశ్మీర్, హర్యానాలో ఎన్నికలు పూర్తవగా..మరోసారి కొన్ని రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో ఆ యా రాష్ట్రాలలో ఎన్నికల పండుగ వచ్చినట్లుగా భావిస్తున్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఎన్నికల శంఖారావం పూరించడానికి కేంద్రం ఎన్నికల సంఘం సిద్దమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను సీఈసీ ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో వెల్లడించనుంది.కాగా.. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లు ఉండగా..మహారాష్ట్రలో పదవీకాలం నవంబరు 26 తో ముగియనుంది. దీంతో అక్కడ ఎన్నికల ఏర్పాటుకు సీఈసీ సిద్ధం అయింది.
అదే విధంగా 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రం పదవీ కాలం జనవరి 5, 2025 తో ముగియబోతోంది. అయితే ఈ రెండిటితో పాటు ఇంకా కొన్నిస్థానాల్లో ఉప ఎన్నికలు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మరోసారి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తుండటంతో రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.