ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్క్వాడ్‌ను ప్రకటించిన బీసీసీఐ.. టీమిండియా జట్టు ఇదే..!

BCCI Announces Team India Squad For ICC World Test Championship 2023 Final To be Held in Australia on Jun 7-11,BCCI Announces Team India Squad,Squad For ICC World Test Championship,ICC World Test Championship 2023,ICC World Test Championship 2023 Final To be Held in Australia,Mango News,Mango News Telugu,ICC World Test Championship 2023 Latest News,ICC World Test Championship 2023 Latest Updates,ICC World Test on Jun 7-11,BCCI Latest News and Updates

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మునిగితేలుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ మరో శుభవార్తను వినిపించింది. ఐపీఎల్ ముగిసిన కొద్దిరోజుల్లోనే.. అంటే ఈ ఏడాది జూన్ 7-11 తేదీల్లో లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్‌కు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో పాటు భారత్ కూడా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలో 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇందులో కొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు ఉండటం విశేషం. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టిన సెలక్షన్ కమిటీ, గత కొంతకాలంగా జట్టుకు దూరమైన మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేను తిరిగి జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్ ప్రారంభంలో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు తరపున బరిలోకి దిగిన అజింక్యా రహానే.. అనూహ్యంగా సంచలన ఆటతీరుతో 199 స్ట్రైక్ రేట్‌తో ఫామ్‌లోకి రావడంతో సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అలాగే తెలుగు తేజం కేఎస్ భరత్‌ను వికెట్ కీపర్‌గా సెలెక్ట్ చేశారు.

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ భారత జట్టు ఇదే..

  • రోహిత్ శర్మ (కెప్టెన్)
  • శుభ్‌మన్ గిల్
  • ఛటేశ్వర్ పుజారా
  • విరాట్ కోహ్లీ
  • అజింక్యా రహానే
  • కేఎల్ రాహుల్
  • కేఎస్ భరత్ (వికెట్ కీపర్)
  • రవిచంద్రన్ అశ్విన్
  • రవీంద్ర జడేజా
  • అక్షర్ పటేల్
  • శార్దూల్ ఠాకూర్
  • మహ్మద్ షమీ
  • మొహమ్మద్ సిరాజ్
  • ఉమేష్ యాదవ్
  • జయదేవ్ ఉనద్కత్

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eight =