కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ నియామకం

National Election Commission, national news, New Election Commissioner, New Election Commissioner Of India, Rajiv Kumar, Rajiv Kumar Appointed as New Election Commissioner, Retired IAS Officer, Retired IAS Officer Rajiv Kumar

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ కుమార్‌ ను నియమిస్తూ ఆగస్టు 21, శుక్రవారం నాడు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అశోక్‌ లవాసా ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. దీంతో ఆయన కమిషనర్ పదవికి ఇటీవలే రాజీనామా చేశారు. ఆగస్టు 31 నుంచి అశోక్‌ లవాసా విధుల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో నూతన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్ ‌ను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్‌ కుమార్‌ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu