మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

Chiranjeevi, Chiranjeevi Birthday, Chiranjeevi turns 65, Happy Birthday Megastar Chiranjeevi, HBD Megastar Chiranjeevi, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Birthday, Wishes pour in for mega star Chiranjeevi, Wishes Pour in to Greet Megastar Chiranjeevi

ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 65 వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా పలు పరిశ్రమల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, తెలుగు సినీ పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పెద్ద ఎత్తున చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులు దేశంలో 100 సినీ ప్రముఖులతో చిరంజీవి పుట్టినరోజు కామన్‌ డీపీ విడుదల చేయించి సంబరాలు మొదలు పెట్టారు. తమ అభిమాన నటుడి గురించి ట్వీట్లు, స్పెషల్ డిజైన్స్ పోస్టు చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో చిరంజీవి నటిస్తున్న 152 వ చిత్రం “ఆచార్య” ఫస్ట్ లుక్ మరియు, మోషన్ పోస్టర్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. కొంత విరామం తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా చిత్రాలు కోట్లాది అభిమానులను ఉర్రుతలూగించడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన కలెక్షన్స్ నమోదు చేశాయి. ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కరోనా పరిస్థితుల వలన షూటింగ్స్ ఆగిపోవడంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుంది. అలాగే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − ten =