భారత్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం నాడు ప్రకటించింది. శ్రీలంక తో సిరీస్ కోసం భారత్ టెస్ట్ జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్‌గా రోహిత్ నియామకంపై ప్రకటన చేశారు. జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం కెప్టెన్ స్థానం నుంచి వైదొలుగుతూ విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మనే పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 4 నుంచి స్వదేశంలో శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు. కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా మరియు రిషబ్ పంత్ వంటి యువ ఆటగాళ్ల పేర్లు టెస్ట్ కెప్టెన్సీ కోసం వినిపించినప్పటికీ సెలెక్టర్లు అనుభవజ్ఞుడైన రోహిత్ వైపే మొగ్గు చూపారు. రోహిత్ ఇప్పటివరకు 43 టెస్టు మ్యాచ్‌లు ఆడి 46.87 సగటుతో 3047 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు మరియు 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు భారత్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్ గా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ