కుమారస్వామి రాజీనామా చేయాల్సిందే అంటున్న కర్ణాటక బిజెపి నేతలు

BJP Leaders Demand To Resignation Of CM Kumaraswamy,Mango News,CM Kumaraswamy Resignation Latest News,BJP to protest in Karnataka demanding CM Kumaraswamy resignation,BJP steps up demand for Karnataka CM resignation,BJP leader demands resignation of Karnataka CM Kumaraswamy,Karnataka Crisis Updates
  • సుప్రీం కోర్టు ని ఆశ్రయించిన అసమ్మతి నేతలు
  • శివకుమార్ ని అడ్డుకున్న ముంబయి పోలీసులు
  • కుమారస్వామి రాజీనామా చేయాలి అంటున్న యడ్యూరప్ప

కర్ణాటక సిఎం కుమారస్వామి రాజీనామాను డిమాండ్ చేస్తూ కర్ణాటకలో బిజెపి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో బలం లేకపోయినా, పదవిలో కొనసాగుతున్నారు అని వెంటనే రాజీనామా చేయాలనీ కర్ణాటక భారతీయ జనతా పార్టీ (బిజెపి,) నాయకులు, జూలై 10 న జనతాదళ్ (సెక్యులర్) (జెడి [ఎస్]) కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ధర్నా చేస్తున్నారు. కర్ణాటక లో సుమారు 14 మంది కాంగ్రెస్, జెడిఎస్ చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించడంతో కాంగ్రెస్- జెడిఎస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. మరో ఇద్దరు స్వతంత్రులు కూడ కలవడంతో అసమ్మతి నేతల సంఖ్య 16 కి చేరుకుంది.

సీఎం కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే వరకు పార్టీ నాయకులు విధాన సౌధ, అసెంబ్లీ కార్యాలయం వెలుపల ధర్నా నిర్వహిస్తారని బిజెపి సభ్యుడు యడ్యూరప్ప అన్నారు. మరో వైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు, తమ రాజీనామాలు ఆమోదించకుండా అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవరిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసారు, రేపు సుప్రీం కోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.

మరో వైపు అసమ్మతి నేతలతో చర్చించేందుకు ముంబయి వెళ్లిన కాంగ్రెస్ లీడర్, మంత్రి డి.కే శివకుమార్ ని పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు కలవడానికి నిరాకరించినప్పటికీ, శివకుమార్ ముంబయి వెళ్లడంతో వారు రక్షణ కావాలని పోలీసులని ఆశ్రయించారు. కర్ణాటక రాజకీయాలు క్షణ క్షణం ఉత్కంఠగా మారుతున్నాయి, రెండు మూడు రోజుల్లో ఎదో ఒక ముగింపు వస్తుందని నేతలు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − eleven =