దేశంలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిదో నెలలో కూడా లక్ష కోట్లు దాటాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,02,709 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. గత ఏడాది మే నెల జీఎస్టీ ఆదాయతో పోల్చితే ఇది 65% ఎక్కువని తెలిపారు. రూ.1,02,709 కోట్లులో సీజీఎస్టీ వసూళ్లు రూ.17,592 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.22,653 కోట్లు, ఐజీఎస్టీ రూ.53,199 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.26,002 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ. 9,265 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.868 కోట్లు) వసూలు అయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాలు కఠినమైన లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ మే నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ