నిలోఫర్‌ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్

CS promises to strengthen infra in government hospitals, CS Somesh Kumar Visits Niloufer Hospital, Mango News, Somesh Kumar, Telangana CS, Telangana CS held a Video Conference, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Visited Niloufer, Telangana CS Somesh Kumar Visited Niloufer and MNJ Cancer Hospitals, Telangana CS visits MNJ cancer hospital

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డిలతో కలసి నిలోఫర్‌ మరియు ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రులను సందర్శించారు. నీలోఫర్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్ ఐసీయూ మరియు ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్ లుకేమియా వార్డు మరియు ఇతర వార్డులను సీఎస్ సందర్శించారు. వైద్యులు, చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించారు.

రాష్ట్రంలో ఆరోగ్య పరంగా వ్యాప్తి చెందే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ తెలిపారు. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలకు మెరుగైన చికిత్సకై అన్ని ఆసుపత్రులలో పీడియాట్రిక్ సదుపాయాలను అభివృద్ధి చేసి, అవసరమైన వైద్య సామగ్రి, మందులు, మానవ వనరులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో చేపట్టిన సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని టిఎస్‌ఐఐసి అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ సందర్శనలో సీఎస్ తో పాటుగా నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, ఎస్సిడిడి కార్యదర్శి రాహుల్ బోజ్జా, కాలోజి నారాయణ రావు హెల్త్ యూనివర్సిటి వైస్ చాన్స్ లర్ కరుణాకర్ రెడ్డి, టిఎస్ఐఐసి, మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, , జోనల్ కమీషనర్ ప్రావీణ్య, మెడికల్ మరియు జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =