‘సంచార్ సాథీ’ యాప్‌ పై కేంద్రం కీలక ప్రకటన

Sanchar Saathi App Centre Withdraws Order Pre-installation Mandatory on New Mobile Phones

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేసే మొబైల్ ఫోన్లలో ‘సంచార్ సాథీ’ యాప్‌ను ముందుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. యాప్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మరియు స్వచ్ఛందంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) ప్రకటించింది.

ప్రీ-ఇన్‌స్టలేషన్‌ తప్పనిసరి కాదు..
  • ఉపసంహరణ కారణం: యాప్‌ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) ప్రకటించింది. యాప్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు వివరించింది.

  • పెరిగిన డౌన్‌లోడ్‌లు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత, ప్రజలు స్వచ్ఛందంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న సంఖ్య ఒక్కరోజులోనే పదింతలు పెరిగిందని డీఓటీ తెలిపింది. సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను ఒకసారి చూసినట్టయితే ఈ వెబ్‌సైట్‌కు ఇప్పటివరకూ మొత్తంగా 20 కోట్ల వెబ్‌సైట్ హిట్లు వచ్చాయి, అలాగే 1.4 కోట్ల మంది ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

  • వినియోగదారుల సంఖ్య: ఇప్పటివరకు 1.4 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, గడచిన ఒక్క రోజులోనే 6 లక్షల మంది యూజర్లు యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని వివరించింది. వినియోగదారుల సంఖ్య శీఘ్రగతిని పెరుగుతోందని చెప్పింది.

  • ఉద్దేశం: యాప్‌ను తప్పనిసరి చేయడం వెనుక ఉద్దేశం ఈ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రజలందరికీ తేలిగ్గా తెలుసుకునే అవకాశం కల్పించడం మాత్రమేనని డీఓటీ వివరించింది.

  • తుది నిర్ణయం: సంచార్ సాథీకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ఇకపై ముందస్తు ఇన్‌స్టలేషన్ తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here