ఆ యాప్‌లను తొలగించిన గూగుల్, యాపిల్

Google And Apple Removed Dangerous Apps, Apple Removed Dangerous Apps, Dangerous Apps Removed, Google And Apple Removed Apps, Airalo, Holafly, eSIM, Check For Dangerous Apps, Google And Apple Removed Those Apps, Latest Google And Apple News, Latest Dangerous Apps Removed News, Play Store, Technology, Mango News, Mango News Telugu
Airalo,Holafly,eSIM,Check for dangerous apps, Google and Apple removed those apps

టెక్నాలజీ ఏ రేంజ్‌లో డెవలప్ అవుతుందో అదే విధంగా సైబర్ మోసాలు కూడా అదే రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలామంది మోసపోతూ ఉండటంతో.. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్’తాజాగా కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీనిలో భాగంగానే గూగుల్, యాపిల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి   ఈ యాప్‌లను తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్‌లో , హోలాఫ్లై, ఈసిమ్ వంటి యాప్‌లను తొలగించాయి. ఇండియాలో ఈ సిమ్ అమ్మకాలు చేపట్టాలంటే తప్పకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలి.  అప్పుడు మాత్రమే ఆ  డీలర్లు ఈసిమ్‌ను అమ్మొచ్చని.. అయితే అమ్మే ముందు తప్పకుండా పాస్‌పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్‌ను కస్టమర్‌ నుంచి తీసుకోవాలి. అమ్మే వ్యక్తులు ఈ  గ్లోబల్ సిమ్‌ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు తప్పకుండా అందించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కండిషన్ విధించింది.

మరోవైపు సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లో, స్పెయిన్‌కు చెందిన హోలాఫ్లై..అనే రెండు యాప్‌లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవి కూడా ఇండియాలో పూర్తిగా నిషిద్ధమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. నిజానికి ఈసిమ్ అనేది ఫిజికల్ సిమ్ లా కనిపించదు. కేవలం దీనిని నెట్‌వర్క్ ప్రొవైడర్ నుంచి మాత్రమే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రమే.. ఈసిమ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగించుకుంటున్నారు.

ఈసిమ్, ఎయిర్‌లో, హోలాఫ్లై వంటి వాటిని నిషేధించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే..ఇలాంటి యాప్స్ నుంచి  ఇంటర్నేషనల్ నెంబర్లను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్ననట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్  గుర్తించింది.  అందుకే సైబర్ మోసాల సంఖ్యను తగ్గించడానికి, వీలయితే  కంప్లీట్‌గా చెక్ పెట్టడానికి  డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =