బడ్జెట్ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్ .. నిర్మలమ్మ చీర

Special Attraction In The Budget Speech Nirmalammas Saree, Special Attraction In The Budget Speech, Budget 2025 Updates, Finance Minister Nirmala Sitharaman, Nirmalamma’s Saree, The Budget Speechv, Customs Duties, Import Tariffs, Price Changes, New Tax Changes, New Budget, Modi, BJP, Budget 2025, Income Tax, Nirmala Sitharaman, Tax Slabs, TDS Changes, India, National News, International News, Live Updates, Breaking News, Headlines, Live News, Political News, Mango News, Mango News Telugu

ఆర్ధికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ గురించి ఓ వైపు చర్చ నడుస్తుంటే..మరోవైపు కేంద్ర మంత్రి నిర్మలమ్మ కూడా . చర్చనీయాంశం అయ్యారు. నిజానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేరోజు కట్టుకునే చీర ఎప్పుడూ టాక్ ఆఫ్ ది భారత్ అవుతుంది. అలాగా ఇప్పుడు కూడా బడ్జెట్‌ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ కట్టుకున్న చీర ప్రత్యేక వార్తే అయింది.

ఎన్డీఏ కూటమి కింద మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇది ఆర్ధిక శాఖామంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్ అయినా కూడా.. మోదీ 3.0 ప్రభుత్వంలో రెండోసారి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం మరో విశేషం. ముందుగా కోట్లాది ప్రజల భవితవ్యానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వినిపిస్తుండగా.. మరోవైపు చాలా మంది చూపు నిర్మలమ్మ ధరించిన చీర మీదే పడింది.

బడ్జెట్ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐకానిక్ చీరలు.. ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయన్న విషయం తెలిసిందే.తన వస్త్రధారణ, చీరల ఎంపికలలో చేనేత, హస్తకళాలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటూ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తారు నిర్మలమ్మ. ఈ సంవత్సరం ఆమె ఆహ్లాదకరమైన బంగారు వర్క్ తో కూడిన పాలలాంటి తెల్లటి చీర, రుద్రబంగారపు బ్లౌజు ధరించి నిర్మలమ్మ నిర్మలంగా కనిపించారు. చేతిలో బడ్జెట్ పత్రులు షాలువాతో బడ్జెట్ ప్రసంగానికి బయలుదేరుతున్నప్పుడే ఎంతో మంది తమ కెమెరాలకు పని చెప్పారు.