పార్లమెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. అంబేద్కర్ వ్యాఖ్యలపై దుమారం..

Storm Over Ambedkar Comments High Tension In Parliament, High Tension In Parliament, Storm Over Ambedkar Comments, Ambedkar Controversy, Amit Shah Comments, BJP Vs Congress, Parliament Tension, Rahul Gandhi Protest, Winter Parlamentary Sessions, One Nation One Election Bill, One Election Bill, Parlament Meetings, Winter Sessions, Parlament, National News, India, Congress, BJP, PM Modi, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజకీయంగా గందరగోళం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. అమిత్ షా మాటలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించేదిగా ఉన్నాయని విపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

ఇవాళ తెల్లవారు జామున నుంచే పార్లమెంట్ ఆవరణలో ఎన్‌డీయే, ఇండియా కూటమి ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు హోంమంత్రి క్షమాపణ చెప్పాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అయితే, బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్‌ను అవమానించిందని ఆరోపిస్తూ ప్రతినిరసన చేపట్టారు.

రాహుల్ గాంధీ-బీజేపీ మధ్య గొడవ

పార్లమెంట్ ఎంట్రన్స్ దగ్గర కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. రాహుల్ గాంధీతోపాటు మరో ఎంపీ, బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగిని నెట్టేశారని సారంగి ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, తాను పార్లమెంట్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని, ఈ క్రమంలో తోపులాట జరిగిందని వివరించారు.

పార్లమెంట్‌లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రెండు సభలూ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడ్డాయి. ఈ వివాదం నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు ర్యాలీ చేపట్టారు. కాగా, బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు.

అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో ఏర్పడిన ఈ వివాదం, పార్లమెంట్ లోనూ వెలుపల గందరగోళ పరిస్థితులను సృష్టించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.