చైనాలో విధ్వంసం సృష్టిస్తున్న కరోనా.. రికార్డ్ స్థాయిలో 90 కోట్ల మందికి సోకిన మహమ్మారి

Wide Range of Covid-19 Cases in China Touch 900 Million Claims Peking University, 900 Million Covid-19 Cases, Wide Range of Covid-19 Cases in China, China Touch 900 Million Covid-19 Cases, Peking University Says China Touch 900 Million Covid-19 Cases, China Covid-19 Updates, China Covid-19 Live Updates, China Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, China Coronavirus, China Coronavirus Cases, China Coronavirus Deaths, China Coronavirus New Cases, China Coronavirus News, China New Positive Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in China, Mango News, Mango News Telugu

చైనాలో మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడచిన రెండు, మూడేళ్ళుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న కఠిన నిబంధనలను ఇటీవల చైనా ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిరోజూ పాజిటివ్‌ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలోని ప్రఖ్యాత పెకింగ్ విశ్వవిద్యాలయం అసలు దేశంలో ఇప్పటివరకు ఎన్ని కరోనా కేసులు నమోధై ఉంటాయనే దానిపై ఒక అధ్యయనం నిర్వహించింది. దీనిప్రకారం.. జనవరి 11 నాటికి 900 మిలియన్లకు పైగా ప్రజలు చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డారు. అంటే దేశ జనాభాలో దాదాపు 64% మందికి కోవిడ్-19 సోకినట్లు పెకింగ్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. మరో ముఖ్య విషయం ఏంటంటే.. అత్యధికంగా గాన్సు ప్రావిన్స్‌లో 91 శాతం మంది ప్రజలు వైరస్‌ బారిన పడినట్లు అధ్యయనంలో తేలింది. ఇక దీని తర్వాత తర్వాత యూనాన్‌లో 84 శాతం, కింఘైలో 80 శాతం మంది ప్రజలు వైరస్‌ బారిన పడినట్లు పేర్కొంది. కాగా, చైనాలో ఈ పరిస్థితి మరో 3 నెలల వరకు కొనసాగుతుందని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈలోపు ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − eleven =