చాలా కాలంగా అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఇటీవల ఆమె అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలోకి నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా సునీతా విలియమ్స్ మరో రికార్డు సృష్టించి అందరినీ ఆబ్బురపరిచారు. 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచి కొత్త రికార్డు సృష్టించారు.
జూన్ 2024 నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ ..జనవరి 30న ఆమె తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ అంతరిక్షంలో నడిచారు. అప్పుడు సునీతా విలియమ్స్, వ్యోమగామి బీచ్ విల్లిమోన్ ISS వెలుపలికి వెళ్లి దెబ్బతిన్న రేడియో కమ్యూనికేషన్ హార్డ్‌వేర్‌ను తొలగించి, కక్ష్యలో ఉన్న ప్రయోగశాల బయట సూక్ష్మజీవులు ఉన్నాయో లేదో నిర్ధారించగల నమూనాలను కలెక్ట్ చేశారు.
నాసా అందించిన సమాచారం ప్రకారం.. అంతరిక్ష నడక తూర్పు తీర సమయం జనవరి 30 ఉదయం 7:43 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:09 గంటలకు ముగిసింది.మొత్తంగా వీరిద్దరూ 5 గంటల 26 నిమిషాలు అంతరిక్ష కేంద్రం బయట ఉన్నారు. మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ గతంలో అంతరిక్షంలో గడిపిన 60 గంటల 21 నిమిషాల సుదీర్ఘ అంతరిక్ష వాకింగ్ సమయాన్ని ఆమె ఇప్పుడు అధిగమించారు. అత్యధిక అంతరిక్ష నడకలు చేసిన మహిళా వ్యోమగామిగా విట్సన్ రికార్డును సునీత బ్రేక్ చేశారు. సునీత విలియమ్స్ మొత్తం అంతరిక్ష నడక సమయం 62 గంటల 6 నిమిషాలు, నాసా ఆల్-టైమ్ రికార్డు జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 2024లో బోయింగ్ స్టార్‌లైనర్‌లో ISSకి ఎనిమిది రోజుల మిషన్‌కు వెళ్లినా..సాంకేతిక లోపం ఏర్పడటంతో వారిద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. హీలియం లీకేజీ, స్టార్‌లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం వంటి టెక్నికల్ సమస్యలవల్ల వారిద్దరూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బోయింగ్ ప్రత్యర్థి సంస్థ స్పేస్‌ఎక్స్ నిర్మించిన అంతరిక్ష నౌకను ఉపయోగించి మార్చి చివరిలో వీరిద్దరినీ భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా రెడీ అవుతోంది.