టామ్ టామ్ నివేదికలో ఢిల్లీది ఎన్నో ప్లేస్?

Most crowded city, Bangalore is the sixth crowdedest city in the world, Delhi, Tom Tom report,Pune, Delhi, London, TomTom Traffic Index 2023, congested city, Traffic, Silicon valley, Technology, new delhi, Mango News Telugu, Mango News
Most crowded city, Bangalore is the sixth crowdedest city in the worl, Delhi, Tom Tom report,Pune, Delhi, London,

ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్.. టామ్‌టామ్ 2023 రిపోర్టును విడుదల చేసింది.దీని ప్రకారం ప్రపంచంలోనే ఆరో మోస్ట్ క్రౌడెడ్ సిటీగా బెంగళూరు నిలిచింది. టామ్‌టామ్ రిపోర్టు ప్రకారం..ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న సిటీలలో బెంగళూరు ఆరో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర రాజధాని పూనే ఏడో ప్లేసులో ఉంది.

2022లో బెంగళూరు ఈ లిస్టులో సెకండ్ ప్లేసులో ఉండగా..ప్రస్తుతం  ఆరో స్థానానికి చేరుకోవడంతో బెంగళూరు కాస్త మెరుగుపడిందని నిపుణులు అంటున్నారు. గత ఏడాది బెంగళూరులో 10 కి.మీటర్ల దూరం వెళ్లడానికి సుమారు 30 నిమిషాలు సమయం పట్టేది. అయితే ప్రస్తుతం 28 నిమిషాలు  పడుతున్నట్టు టామ్‌టామ్ నివేదిక పేర్కొంది.

ఇక, పూనేలో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 27 నిమిషాల 50 సెకన్లు పడుతుంది. అలాగే దేశ రాజధాని న్యూఢిల్లీ ఈ లిస్టులో 44వ స్థానంలో ఉంది. గతేడాది ఢిల్లీలో 10కిలోమీటర్లు ప్రయాణించడానికి 21 నిమిషాల 40సెకన్లు పడుతుంది. అలాగే ముంబై 54వ స్థానంలో నిలిచింది.

మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక రద్దీ సిటీగా బ్రిటన్ రాజధాని లండన్ ఫస్ట్ ప్లేసులో ఉంది. లండన్‌లో 10 కి.మీటర్లు వెళ్లడానికి 37 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ  ఉంటుందని తెలిపింది. ఈ లిస్టులో రెండో ప్లేసులో ఉన్న డబ్లిన్ సిటీలో 29 నిమిషాల 30 సెకన్లు పడుతుంది.అలాగే మూడో ప్లేసులో ఉన్న కెనడా రాజధాని టొరంటోలో 10 కి.మీటర్లు ప్రయాణించడానికి 29 నిమిషాలు సమయం పడుతోంది.

లండన్, డబ్లిన్‌లలో 2022తో పోల్చితే దాదాపు 9 కి.మీటర్ల ప్రయాణానికి ఒక నిమిషం  మాత్రమే సమయం పెరిగింది.  టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఆరు ఖండాల్లోని 55 దేశాల్లోని 387 సిటీల్లో ఈ  అధ్యయనం చేసింది. వాహనాల సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, మొదలైన వాటి ద్వారా రద్దీని అంచనా వేసింది. 600 మిలియన్లకు పైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్‌, మొబైల్ ఫోన్‌ల డేటా ఆధారంగా దీనిని రూపొందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − three =