భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. అయితే ఈ నెలలోనే వారిద్దరినీ తిరిగి భూమికి తీసుకురావడానికి, క్రూ-10 మిషన్‌ను ప్రారంభిస్తున్నారని..ఈ ఇద్దరి స్థానంలో నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తున్నారని..దీంతో సునీత అతి త్వరలోనే భూమిమీదకి తిరిగి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ సాంకేతిక లోపం వల్ల క్రూ-10 మిషన్ రద్దు చేసినట్లు నాసా తాజాగా ప్రకటించడంతో సునీతకు మళ్లీ నిరాశ ఎదురయినట్లయింది. దీనికి తోడు ఈ మిషన్ తిరిగి ఎప్పుడు ప్రారంభించబోతుందో నాసా ఇంకా ప్రకటించలేదు
నలుగురు వ్యోమగాములను సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపి..వారి అక్కడకు వెళ్లాక వీరిద్దరూ తిరిగి వస్తారని భావించారు. నిజానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 8 రోజుల మాత్రమే ఉండాల్సి ఉండగా.. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. కానీ బోయింగ్ స్టార్‌లైనర్‌లో పనిచేయకపోవడంతో సునీత, విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 19 మార్చి 20న భూమి మీదకు తిరిగి వస్తారని అందరూ అంచనా వేయగా, ఇప్పుడు నాసా మరో ఫ్లాన్ విఫలమవడం ఇద్దరి కుటుంబసభ్యులను తీవ్ర నిరాశకు గురి చేసింది.దీనికి తోడు సునీతకు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధన, నిర్వహణ కోసం పని చేస్తున్నప్పుడు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ సురక్షితంగా ఉన్నారని నాసా ధృవీకరించింది. మరోవైపు మార్చి 4న నాసా అధికారులతో మాట్లాడిన ఒక కాల్‌లో,ఈ మిషన్ తర్వాత తన కుటుంబం, పెంపుడు కుక్కలతో తిరిగి కలవాలని ఉందని సునీతా విలియమ్స్ చెప్పుకొచ్చారు.