ప్రపంచ మార్కెటింగ్ రంగాన్ని చైనా అందిపుచ్చుకున్నంతగా మరే దేశం అందిపుచ్చుకోదు అన్న మాటలు తరచూ వింటూనే ఉంటాం. చాలా దేశాల్లో చైనా ప్రొడెక్ట్స్ పై బ్యాన్ విధించినా కూడా చీప్ అండ్ బెస్ట్ అని ఎక్కువ మంది కొనే వస్తువుల్లో చైనావే ఉంటాయి. అయితే చివరకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విషయంలోనూ మార్కెటింగ్ మైండ్‌ను బయటకు తీసింది.
యూఎస్‌లోని పెన్సిల్వేనియాలో ఎలక్షన్ క్యాంపెయిన్ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో.. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం హాట్ టాపిక్ అయింది. ఈ దాడిలో ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారనే చెప్పొచ్చు. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు కాల్పులు జరిపగా.. ఆ తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని హతమార్చారు.
అయితే ఇలా దాడి జరిగిందో లేదో, దానిని క్యాష్ చేసుకుంది చైనా మార్కెట్ . దాడి తర్వాత ట్రంప్ చేతులు బిగించి, తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ”ఫైట్ ఫైట్ ఫైట్” అంటూ నినదించిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారడం తెలిసిందే. అయితే ఈ చిత్రాలతో ఇప్పుడు ఏకంగా టీ-షర్టులు రెడీ అయిపోవడం చూసి చాలామంది షాక్ అయ్యారు.
అమెరికా స్థానిక కాలమానం ప్రకారం, జులై 13 సాయంత్రం 6.15 గంటలకు ట్రంప్‌పై హత్యాయత్నం జరగగా..సాయంత్రం 6.31 గంటలకు అంటే కేవలం 16నిమిషాల తర్వాత .. పిడికిలి పైకెత్తిన ట్రంప్ ఫోటో రిలీజ్ అయింది. అదే రోజు రాత్రి 8 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దాడిని ఖండించారు. అయితే, కరెక్టుగా గంటన్నర వ్యవధిలోనే చైనా తయారీదారులు..మాజీ అధ్యక్షుడు ట్రంప్ పిడికిలి పైకెత్తిన ఫోటోతో టీషర్టుని తయారు చేసేశారు. పెద్ద సంఖ్యలో ఈ టీ షర్టులను ఉత్పత్తి చేయడానికి చైనా తయారీదారులు రెడీ అయిపోయారు. మొదటి బ్యాచ్ టీ-షర్టులు ఫేమస్ చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన టావోబావోలో రాత్రి 8.40 గంటలకు సేల్స్ కు కూడా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ పై దాడి గురించి చాలా మంది దేశాధినేతలు స్పందించే లోపే టీ-షర్టుల తయారీ కూడా మొదలైంది. కేవలం మూడు గంటల్లోనే చైనా, యూఎస్ నుంచి 2వేల కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు టావోబావో సైట్ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ