కరోనా పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్ ను మరోసారి పొడిగించింది. కొన్ని ఆంక్షలను సడలిస్తూ జూలై 19 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించారు. దుకాణాలను రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అవకాశం ఇవ్వగా, రెస్టారెంట్లు, టీ షాపులు, బేకరీలు, రోడ్ పక్కన ఫుడ్ స్టాల్స్ మరియు స్వీట్ షాపులను 50శాతం కస్టమర్లతో రాత్రి 9 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఈ అన్ని ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్ కు అనుగుణంగా ఏర్పాటు చేయాలని సూచించారు. హ్యాండ్ శానిటైజర్ లు అందుబాటులో ఉంచడం, క్యూలలో ఉండే వ్యక్తులు సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని చెప్పారు.
మరోవైపు వివాహాలకు హాజరయ్యేందుకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే అనుమతి ఇచ్చారు. పాఠశాలలు, కాలేజీలు, బార్‌లు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మరియు జంతుప్రదర్శనశాలలు మూసివేయబడే ఉంటాయని చెప్పారు. అలాగే ప్రజలతో నిర్వహించే సాంస్కృతిక మరియు రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్పారు. రాష్ట్రంలో జిల్లాల మధ్య బస్సులను ప్రారంభించనప్పటికీ, పొరుగున రాష్ట్రమైన పుదుచ్చేరికి బస్సు సేవలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటివరకు 25,13,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 24,46,552 మంది కరోనా నుంచి కోలుకోగా, 33,322 మంది మరణించారు. ప్రస్తుతం 33,224 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ