ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్‌టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న

Foundation Stone for Integrated Handloom Training and Textile Park Construction, foundation stone for mega textile park, Mango News, Mega Textile Park, Minister KTR, Minister KTR Lays Foundation Stone for Integrated Handloom Training, Minister KTR Lays Foundation Stone for Integrated Handloom Training and Textile Park Construction, Telangana State Government, Textile Park Construction, Textile Park Construction In Telangana

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక మంత్రి కేటీఆర్ శనివారం నాడు నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ముందుగా నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ఐసీయూ వార్డును మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అలాగే రూ.6 వెజ్, నాన్​వెజ్​ మార్కెట్‌ సమీకృత మార్కెట్‌ కు, అమరవీరుల స్మారక పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయ‌ణ‌పేట‌లో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం నారాయ‌ణ‌పేటలో ఉన్న చేనేత క‌ళాకారుల కోసం నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం, వారి ఉత్పత్తులను వారే మార్కెటింగ్ చేసుకునే విధంగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి కోరారని చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.10 కోట్ల‌తో నైపుణ్య శిక్ష‌ణ కేంద్రానికి, టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాప‌న చేసుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ చేనేత, ప‌వ‌ర్‌ లూమ్ కార్మికుల‌కు కూడా బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని చెప్పారన్నారు. దీనివలన నారాయణపేటలో ఉన్న చేనేత కార్మికుల‌కు అపార‌మైన లాభం జ‌రుగుతుంద‌న్నారు. ఇక ఈ కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి సహా పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 14 =