ఒకేరోజులో కరోనాతో 119 మంది మృతి, 5880 పాజిటివ్ కేసులు నమోదు

Tamilnadu Reports 5880 New Covid-19 Cases and 119 Deaths Today

తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావంతో గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 100 కి పైగానే మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7, శుక్రవారం నాడు కూడా 119 మంది కరోనాతో మరణించారు. మరో 5880 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,024 కి చేరింది. అలాగే శుక్రవారం నాటికీ రాష్ట్రంలో 30,88,066 కరోనా పరీక్షలను నిర్వహించి, దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.

తమిళనాడు కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 7, శుక్రవారం నాటికీ):

  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,85,024
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 2,27,575
  • యాక్టీవ్ కేసులు – 52,759
  • ఆగస్టు 7 న నమోదైన కేసులు – 5880
  • ఆగస్టు 7 న డిశ్చార్జ్ అయినవారు – 6488
  • ఆగస్టు 7 న నమోదైన మరణాల సంఖ్య – 119
  • మొత్తం మరణాల సంఖ్య – 4690

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu