కరోనా వ్యాక్సిన్ పై మరో ముందడుగు, అత్యవసర వినియోగం కోసం ఫైజర్‌ దరఖాస్తు

Covid-19 vaccines, Emergency Use Authorization for Vaccines, FDA Emergency Use, Mango News Telugu, Pfizer and BioNTech to Submit Emergency Use, Pfizer Filed Application to US FDA, Pfizer files Covid-19 vaccine application, Pfizer Files for FDA Emergency Use, Pfizer seeks US FDA approval, US FDA, US FDA for Emergency, US FDA for Emergency Use of Covid-19 Vaccine

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారీపై ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు చేపడుతున్న క్లినికల్ ట్రయల్స్ కీలక దశకు చేరుకుంటున్నాయి. ఇటీవలే అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్‌ 95 శాతం సమర్ధంగా పనిచేస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషణ చేసిన అనంతరం తమ వ్యాక్సిన్ కరోనా నివారణలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఫైజర్ తెలిపింది. ఈ నేపథ్యంలో తమ కరోనా వ్యాక్సిన్‌ ను అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ శుక్రవారం నాడు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)ను ఫైజర్ సంస్థ సంప్రదించింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి నివేదికను ఎఫ్‌డీఏకు ఫైజర్ అందజేసినట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ వినియోగం కోసం ఫైజర్ సంస్థ దాఖలు చేసిన అత్యవసర ప్రామాణీకరణ అభ్యర్థనపై చర్చ, అంచనా వేయడం కోసం డిసెంబర్ 10 వ తేదీన ఎఫ్‌డీఏ ప్యానెల్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఫైజర్ వ్యాక్సిన్ కు ఎఫ్‌డీఏ అనుమతి లభిస్తే, అమెరికాలో డిసెంబర్‌ నెలలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవలే అమెరికాకు చెందిన మరో ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా రూపొందించిన mRNA-1273 కరోనా వ్యాక్సిన్ కూడా కరోనాను నివారించడంలో 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − three =