తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 5, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,971 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరోకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,924 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంకాగా, మరణాల రేటు 0.58 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 248 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,58,657 కు చేరుకుంది. ప్రస్తుతం 4,390 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు మంగళవారం నాడు 46,578 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,65,89,959 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 7,14,399 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ