బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు ప్రకటన

2021 Badvel By-Election, 2021 Badvel Bypolls, Andhra’s Badvel Assembly bypoll, Badvel Assembly BYpoll news, Badvel Assembly constituency, Badvel By-Election 2021, Badvel By-Election Candidate, Badvel By-Election Latest News, Badvel bypoll News, Congress High Command, Congress High Command Declared Ex-mla Kamalamma as Party Candidate for Badvel By-election, Congress Party Candidate for Badvel By-election, Ex-mla Kamalamma as Party Candidate for Badvel By-election, Mango News

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరును ప్రకటించారు. పీ.ఎం కమలమ్మ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించినట్టుగా ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ మంగళవారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఈ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా మృతి చెందిన ఎమ్మెల్యే సతీమణికే వైఎస్సార్సీపీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో సంప్రదాయాలను గౌరవిస్తూ బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here