
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మహిళల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే . కాగా తాజాగా మహిళలు ఆర్థికాభివృద్ధి పెంపొందించడానికి ‘బీమా సఖి యోజన’ పేరుతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా మహిళలు వర్క్ ఫ్రం హోం చేయొచ్చు. అలాగే ఖాళీ సమయాల్లో కూడా కాస్త రిలేషన్ షిప్ మెయింటేన్ చేసి ఆదాయాన్ని పొందవచ్చు.అయితే అంతకంటే ముందే మహిళలకు బీమా సఖిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. ఇలా మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందిన తరువాత కమీషన్ రూపంలో ఆదాయాన్ని పొందవచ్చు.
మహిళలు ఖాళీ సమయాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బీమా సఖి యోజన కోసం. 10వ తరగతి నుంచి డిగ్రీ చదివిన వారి వరకు అర్హులే. అయితే వీరు ఇదివరకు ఎల్ ఐసీ ఏజెంట్లుగా చేసిన వారయి ఉండకూడదు. అలాగే ఎల్ఐసీతో సంబంధం ఉన్న విధుల్లో పనిచేయని వారై ఉండాలి.
దీనికోసం ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా వారి ప్రాథమిక వివరాలను అందించి నమోదు చేసుకోవాలి. ఆ తరువాత ఈ దరఖాస్తును ఎల్ఐసీ అధికారులు పరిశీలన చేశాక వారు ఈ పథకానికి అర్హులో కాదో నిర్ణయిస్తారు. ఒకవేళ అర్హులుగా మారితే వీరికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో పాస్ అయిన తరువాత మూడేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. మూడేళ్ల కాలంలో ప్రతినెల వీరికి నెలకు 7వేల చొప్పున స్టైఫండ్ అందిస్తారు. ఆ తరువాత రెండో సంవత్సరంలో 6వేలు అందిస్తారు. మూడో సంవత్సరం 5వేల చొప్పున అందిస్తారు.
కాకపోతే ప్రతీ మహిళ కూడా ప్రతీ ఏడాది 24 పాలసీలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీలు చేయకపోయినా కూడా స్టైఫండ్ మొత్తం బ్యాంకులో జమ అవుతుంది. పాలసీ చేస్తే మాత్రం ప్రతీ పాలసీపై అదనంగా ఆ మహిళకు కమిషన్ అందిస్తారు. ఏడాదిపాటు 24 పాలసీలు చేస్తే.. 48 వేలు అదనంగా వస్తాయి. అయితే రెండో ఏడాది స్టైఫండ్ పొందాలంటే మొదటి ఏడాది చేసిన పాలసీల్లో కచ్చితంగా 65 శాతం యాక్టివ్ గా ఉండాలి. ఈ బీమా సఖి కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమీప ఎల్ఐసీ ఆఫీసుకు వెళ్లాలి. లేదా వెబ్ సైట్ లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.
దీనికోసం ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ అయిన.. https://licindia.in/test2 అనే వెబ్ సైట్ లోకి వెళ్లి ఆ తరువాత పేరు, మొబైల్ నెంబర్ అందించాలి. ఆ తరువాత స్టేట్ తో పాటు జిల్లా పేరు ఎంటర్ చేయాలి. తర్వాత చిరునామాకు దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసుకి సంబంధించిన బ్రాంచ్ ను టిక్ చేసి సబ్మిట్ చేయాలి. దీంతో ఆ వివరాలను సంబంధిత అధికారులు పరిశీలన చేసి .. అర్హులను ఎంపిక చేస్తారు.