రైలు ప్రమాదాల నివారణకు.. ఇండియన్‌ రైల్వేస్‌ ‘కవచ్‌’ సిస్టమ్‌ ఏర్పాటు

Indian Railways Anti-Collision System Kavach Successfully Tested With Railway Minister, Indian Railways Anti-Collision System Kavach Successfully Tested, Anti-Collision System Kavach Successfully Tested With Railway Minister, Indian Railways Anti-Collision System Kavach, Anti-Collision System Kavach, Indian Railways Anti-Collision System, Anti-Collision, Anti-Collision System, Kavach, Indian Railways, Railway Minister, Minister, Minister Ashwini Vaishnaw, Railway Minister Ashwini Vaishnaw, Indian Railways Latest News, Indian Railways Latest Updates, Indian Railways Live Updates, Mango News, Mango News Telugu,

రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన ‘కవచ్‌’ అనే ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్ సిస్టమ్‌ విజయవంతంగా పరీక్షించబడింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్‌ – వాడి – ముంబై మార్గంలో ‘కవచ్‌’ అమల్లోకి రానుంది. అందులో భాగంగా లింగంపల్లి – వికారాబాద్‌ సెక్షన్‌ను ‘కవచ్‌’ పరిధిలోకి తెచ్చారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈరోజు (శుక్రవారం) కవచ్‌ టెస్ట్‌ రైడ్‌ను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భారతీయ రైల్వే సంస్థ అభివృద్ధి చేసిన యాంటీ-కొలిజన్ సిస్టమ్‌ను సమీక్షించారు. భారతీయ రైల్వే దీనిని ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఆటోమేటిక్ ట్రైన్‌ రక్షణ వ్యవస్థగా చెప్తోంది.

సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్‌-శంకర్‌పల్లి సెక్షన్‌లో ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో భాగంగా రెండు రైళ్లను ఎదురెదురుగా నడిపారు. వీటిలో ఒకదానిలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రయాణం చేయగా.. మరొకదానిలో రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే త్రిపాఠి ఉన్నారు. కాగా.. రెండు రైళ్లు పూర్తి వేగంతో  ప్రయాణించినా కూడా ‘కవచ్‌’ సిస్టమ్‌ వలన ఢీ కొట్టుకోలేదు. ‘కవచ్’ సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా 380 మీటర్ల దూరంలో రెండు రైళ్లును నిలిపివేసింది. నిర్ణీత దూరంలో ఒకే లైన్‌లో రెండు రైళ్లు వేగంగా ఎదురెదురుగా వస్తున్న సందర్భంలో కవచ్ వలన రైలు ఆటోమేటిక్‌గా నిలిచిపోయేలా దీనిలోని ప్రొటెక్షన్ సిస్టమ్‌ రూపొందించబడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 9 =