కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి కేంద్ర భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అందరు ఊహించినట్లుగానే ఆ విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో మార్పులు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు చేసిన మార్పులను వివరించారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిటక్షన్ రూ 50 వేలుగా ఉంది. అయితే దానిని రూ. 75 వేలకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. దీంతో రూ 17,500 వకు పన్ను చెల్లింపు దారులు ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఇక కొత్త పన్ను విధానంలో రూ. 3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. అయితే గతంలో రూ. 3-6 లక్షల శ్లాబుల్లో 5 శాతంగా ఉన్న పన్ను పరిమితిని ఇప్పుడు రూ. 7 లక్షలకు పెంచారు. అలాగే రూ. 6-9 లక్షలుగా ఉన్న శ్లాబును రూ. 7-10 లక్షలకు మార్చారు.
కొత్త శ్లాబులు ఇవే..
0- రూ. 3 లక్షల వరకు సున్నా పన్ను
రూ. 3-7 లక్షల వరకు 5 శాతం పన్న
రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను
రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
పాత శ్లాబులు..
0-రూ. 3 లక్షల వరకు సున్నా పన్ను
రూ. 3-6 లక్షల వరకు 5 శాతం పన్న
రూ.6-9 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.09-12 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను
రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను