57 దేశాల్లో వెలుగుచూసిన ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ – ప్రపంచ ఆరోగ్య సంస్థ

BA.2, BA.2 Omicron sub-variant found in 57 countries, Contagious sub-variant of Omicron now detected, Highly Infectious Omicron Sub-Variant BA.2 Was Found in 57 Countries, Highly infectious Omicron sub-variant found, Highly transmissible Omicron sub-variant now in 57 countries, Mango News, Omicron Sub-Variant BA.2 Found In 57 Countries, Omicron Sub-Variant Could Be More Infectious, Omicron sub-variant detected in 57 countries, WHO, WHO Highly Infectious Omicron Sub-Variant BA.2 Was Found in 57 Countries

ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. ఒక దేశంలో అదుపులోకి వచ్చిందని ఊపిరి పీల్చుకునేలోపే మరోదేశంలో అలజడి రేపుతోంది. అది కూడా తన పరివర్తనాన్ని మార్చుకుంటూ అతి వేగంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ రూపంలో విరుచుకుపడింది. ఇప్పుడు మూడో వేవ్ లో ఒమిక్రాన్ రూపంలో వ్యాప్తి చెందుతోంది. తాజాగా.. ఒమిక్రాన్ లోనే మరో సబ్ వేరియంట్ బయటపడింది. దీనిని బీఏ.2 సబ్ వేరియంట్ అని పిలుస్తున్నారు. ఇప్పటివరకు 57 దేశాల్లో ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కనుగొన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

ఒమిక్రాన్ వేరియంట్ కంటే బీఏ.2 సబ్ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తిచెందే లక్షణం కలిగివుందని అధ్యయనంలో వెల్లడైందని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. సుమారు 2 నెలల క్రితం దక్షిణాఫ్రికాలో మొదటిసారి కనుగొన్న ఒమిక్రాన్.. అనంతరం రకరకాలుగా పరివర్తన చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ అప్ డేట్ లో తెలిపింది. అలాగే, కరోనా వైరస్ మానవ కణాలలోకి  ప్రవేశించడానికి బీఏ.2 సబ్ వేరియంట్ వాహకంగా పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. బీఏ.2 సబ్ వేరియంట్ వృద్ధిరేటులో కూడా పెరుగుదల కనిపిస్తోందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 12 =