అమెరికాలో నాల్గవ బూస్టర్ డోస్ అవసరం రావచ్చు – వైట్ హౌస్ మెడికల్ అడ్వయిజర్ ఆంటోనీ ఫౌసీ

కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్‌తో పోరాడటానికి యునైటెడ్ స్టేట్స్‌లో నాల్గవ డోస్ బూస్ట్ అవసరం ఉండవచ్చని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌసీ సూచించారు. కోవిడ్ -19 మహమ్మారి నుండి యుఎస్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మళ్లీ మరొక బూస్ట్ అవసరం కావచ్చు.. అయితే, బూస్టర్ డోస్ వయస్సు మరియు వ్యక్తుల అంతర్లీన పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుంది. టీకాలు, చికిత్సలు త్వరలో వైరస్‌ను మరింత సమర్ధవంతంగా అడ్డుకునేలా చేస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు.

డాక్టర్ ఫౌసీ ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. రాబోయే నెలల్లో తప్పనిసరిగా మాస్కులు తొలగింపుతోపాటు సంబంధిత ఆంక్షలకు ముగింపు ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నవంబర్‌లో కరోనావైరస్ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ మొదటిసారి కనుగొనబడినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వల్ల 5 లక్షల మంది మంది మరణించారని తెలిపారు. అలాగే, భవిష్యత్తులో వచ్చే వ్యాప్తిని ఎదుర్కోవడానికి టీకాలు మరియు చికిత్సా విధానాలు దోహదపడతాయని అని వైట్ హౌస్ డాక్టర్ ఫౌసీ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ