కర్ణాటక హిజాబ్ వివాదంపై స్పందించిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

HC Refers Matter To Larger Panel Adjourns, High Court Of Karnataka, Hijab Row, Kalvakuntla Kavitha, Karnataka HC, Karnataka HC Refers Matter To Larger Panel Adjourns, Karnataka High Court, Karnataka High Court bench decided to refer the matter to a larger bench for a judgement, Karnataka Hijab Row, Karnataka Hijab Row HC Refers Matter To Larger Panel Adjourns, Karnataka Hijab Row Issue, Karnataka Hijab Row Issue Latest News, Karnataka Hijab Row Issue Latest Updates, Karnataka Hijab Row Issue Live Updates, Karnataka Hijab Row TRS MLC Kalvakuntla Kavitha Reveals A Strong Opinion About Women, Mango News, TRS MLC Kalvakuntla Kavitha, TRS MLC Kalvakuntla Kavitha Reveals A Strong Opinion About Women

కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న హిజాబ్ వివాదంపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా.. మహిళల వస్త్రధారణ విషయంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ స్త్రీల గురించి ఆమె తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలిపారు. దీనిపై ఆమె స్వయంగా రాసిన ఒక సందేశాత్మక కవితను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ  అయినప్పుడు హిజాబ్ ధరించడం కూడా వ్యక్తిగత స్వేచ్చ అవుతుందని ఆమె స్పష్టం చేశారు. హిందూ,  ముస్లిం, సిక్కు, క్రిస్టియన్.. మతం ఏదైనా సరే మనమంతా భారతీయులమే. బొట్టు, టర్బన్, హిజాబ్,  క్రాస్.. ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే అని కవిత పేర్కొన్నారు.

స్త్రీలు.. సృష్టికి మూలం అని, సృష్టికర్తలని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వారికి ఉందన్నారు కవిత. త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య, ‘జై హింద్” అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ,  ‘సారే జహా సే అచ్చా హిందూస్తాన్ హమారా’ అని ఘనంగా చాటిన ముహమ్మద్ ఇక్బాల్, ‘జనగణమన’ గేయంతో మొత్తం జాతిని ఏకం చేసిన ‘రవీంద్రనాథ్ ఠాగూర్’ అయినా మనకు చెప్పింది ఒక్కటే.. మనం ఎవరైనా సరే, మనమంతా  భారతీయులమే’’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 1 =