ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ వంగి వంగీ దండాలు పెట్టిన వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ పూనియా కాన్వాయ్‌లో వచ్చారు. కారు దిగిన ఆయన మొబైల్ ఫోన్ చూడటంలో బిజీ అయ్యారు. అయితే బీజేపీ నేత సతీష్‌కు స్వాగతం పలికిన కలెక్టర్ టీనా దాబీ ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది.
వీడియోలో, రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా జిల్లా కలెక్టర్ దాబీ, పూనియాకు నమస్కారం చేస్తున్నప్పుడు, ఏడు సెకన్లలో వరుసగా ఐదుసార్లు తల వంచడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ టీనా దాబీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. జిల్లాలో ఇటీవల టీనా దాబీ చేపట్టిన క్లీన్‌నెస్ డ్రైవ్ గురించి పూనియా ప్రస్తావించారు , దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బార్మెర్‌లో క్లీన్‌నెస్ ఇన్‌స్పెక్షన్ డ్రైవ్ సందర్భంగా దాబీ దుకాణదారులను మందలిస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
కాగా టీనా దాబీ బాగా పని చేస్తున్నదని సతీష్ అన్నారు. బార్మర్ నగరాన్ని క్లీన్‌గా ఉంచుతున్నారని, డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయిస్తున్నారని ప్రశంసించారు. అలాగే ఆమెను చూసి దాదాగిరి చేస్తున్నావా? అంటూ జోక్ వేశారు. ఆమె బాగా పని చేస్తున్నదని, ఇండోర్ మాదిరిగా బార్మర్ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా టీనా దాబీ 2015లో తన మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్షలో అగ్రస్థానంలో నిలిచింది.
"दादागिरी करके सफाई करवा रहे हो, बाड़मेर भी इंदौर जैसा हो जाएगा। आप अच्छा काम कर रही हो।"#tinadabi @DrSatishPoonia pic.twitter.com/DDc16wrtcf
— Mukesh Mathur (@mukesh1275) October 24, 2024