
25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ రోజు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్గిల్‌లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు మోదీ నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం 9:20 గంటలకు కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించిన మోదీ..షింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించబోతున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో … జూలై 26వ తేదీ ప్రతి భారతీయుడికి చాలా ప్రత్యేకమైన రోజని రాసుకొచ్చారు. నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటామని.. మన దేశాన్ని రక్షించే వారందరికీ నివాళులు అర్పించే రోజని చెప్పారు. తాను కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి మన వీర వీరులకు నివాళులర్పించడంతో పాటు షింకు లా టన్నెల్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయబోతున్నానని వివరించారు. ప్రతికూల వాతావరణంలో లేహ్‌కు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సొరంగం అనేక విధాలుగా ముఖ్యమైనదన్న ప్రధాని.. ఈ సొరంగం సరిహద్దుకు సరఫరాలను అందించడానికి వినియోగించబడుతుందని అన్నారు.
ప్రస్తుతం, లేహ్ లడఖ్ కోసం మొదటిగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి ఆనుకుని ఉన్న జోజిలా పాస్, రెండోది చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న బరాలాచా సొరంగాలు ఉన్నాయి. అయితే, షింకు టన్నెల్ ప్రాజెక్ట్ హిమాచల్ నుంచి నెమో- పదమ్- దర్చా రోడ్డుపై 15వందల800 అడుగుల ఎత్తులో నిర్మించబడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగంగా షింకు లా టన్నెల్ నిలవబోతుంది. 2025 నాటికి పూర్తి కానున్న ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పొడవు 4.1 కి.మీటర్లు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి నీమో- పదమ్- దర్చా మార్గం కేవలం 298 కి. మీటర్లు మాత్రమే. మనాలి- లేహ్ రోడ్ 428 శ్రీనగర్- లేహ్ దూరం 439 కి.మీటర్లు కాబట్టి.. ఇది లేహ్ చేరుకోవడానికి అతి తక్కువ మార్గంగా ఉండబోతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ