నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.. దీంతో ప్రపంచవ్యాప్తంగా జనాభాపై చర్చ మొదలయింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు ఎనిమిది బిలియన్లుగా ఉంది.ఓ ప్రపంచ వ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతుంటే మరో వైపు ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడి పోతోంది. కొన్ని దశాబ్దాలతో పోలిస్తే జనాభా పెరుగుదల తక్కువ స్థాయిలో ఉంటున్నా కూడా జనభా మాత్రం పెరుగుతూనే ఉంది. వార్షిక జనాభా వృద్ధి రేటు రోజురోజుకు క్షీణిస్తూ వస్తోంది. 20వ శతాబ్దం మధ్యలో ఈ వృద్ధి సుమారు 2 శాతంగా ఉండగా ప్రస్తుతం ఒక శాతానికి పడిపోయింది.. సంతానోత్పత్తి రేట్లు తగ్గడానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ కారణంగా చెబుతున్నా కూడా ఈ రేటు తగ్గడం కొంత ఆందోళన కలిగించే విషయమే.
జనన, మరణాల రేట్లు గతంలో ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల జనాభా పెరుగుదల నెమ్మదించింది. ప్రచార అవగాహన, అభివృద్ధి వల్ల జనన రేట్లు తగ్గడంతో పాటు శిశుమరణాల రేటు కూడా తగ్గింది. ఆయుర్దాయం పెరగడం , జననాల రేటు తగ్గడం వల్ల, చాలా దేశాల్లో యువకుల సంఖ్య తగ్గి.. వృద్ధుల నిష్పత్తి పెరుగుతోంది. నిజంగా ఇది ఆరోగ్య సంరక్షణ , సామాజిక వ్యవస్థలకు సవాళ్లను విసురుతున్నట్లే. చైనా 1980 నుంచి 2016 వరకు ఒకటే బిడ్డ విధానాన్ని కొనసాగించగా.. ఆగస్టు 2021లో మాత్రం ఒక జంట ముగ్గురు పిల్లలను కలిగి ఉండవచ్చని అధికారికంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చిందది. అయితే భారత్‌లో కూడా అనధికారంగా చాలామంది వన్ ఆర్ నన్ పద్ధతినే ఫాలో అవుతున్నారు.
పాపులేషన్ పిరమిడ్ అంటే నిర్దిష్ట జనాభా వయస్సు , లింగ కూర్పుతో ఏడిన గ్రాఫ్ ప్రకారం.. అభివృద్ధి చెందిన దేశాలలో సమతుల్యాన్ని సూచించే గ్రాఫ్.. దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువ ఉంటోంది. కానీ ఇక్కడి పాపులేషన్ పిరమిడ్ ఆకారంలో ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా 2021 సంవత్సరంలో మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రకారం ఒక మహిళకు 2.3 మంది పిల్లలున్నారు. ఇదే 1965 సంవత్సరంలో 5.1గా ఉంటే, 1970 సంవత్సరంలో 4.8, 1980 సంవత్సరంలో 3.7, 1990సంవత్సరంలో 3.3గా ఉండి 2000సంవత్సరంలో 2.8కి పడిపోయింది. 2000సంవత్సరంలో వేగం తగ్గింది. 2000-15సంవత్సరాల మధ్య 5 సంవత్సరాల సగటు 0.07తో పోలిస్తే, 2015- 2020 సంవత్సరాల మధ్య ఒక్కో మహిళకు 0.17 మంది పిల్లలు తగ్గారు.
తాజాగా లాన్సెట్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన భారత్‌లో కూడా జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని తేలింది. దీనికి సంతానోత్పత్తి రేటు పడిపోతుందటమే కారణం చెప్పింది. అలాగే దేశంలో 1950లో 6.18గా సంతానోత్పత్తి రేటు, 2021 నాటికి అది 2 కంటే దిగువకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, 2100నాటికి 1.04కు పడిపోవచ్చని కూడా హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న పొల్యూషన్, ఆహారపుటలవాట్లలో మార్పులు, మారుతున్న జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటివి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు సంతానోత్పత్తి రేటులో ఈ తగ్గుదల.. ఉత్పాదక శక్తిపై కూడా ప్రభావం చూపించి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన రెండు దేశాలలో చైనా 1.7శాతం ,భారతదేశం 2.2 శాతం సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE