డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో తులసి గబ్బార్డ్.. భారత సంతతి మహిళకు పెద్ద బాధ్యత

Tulsi Gabbard On Donald Trumps Team, Donald Trumps Team, Donald Trump, Tulsi Gabbard, Tulsi Gabbard Of Indian Origin Is A Big Responsibility, Tulsi Gabbard Cabinet Position, Donald Trump Cabinet, Trump Cabinet Picks, Who is Tulsi Gabbard, President Of The United States, US Elections, America, Kamala Harris, Donald Trump, USA, America Elections, US Elections 2024, US Political News, Political News, Mango News, Mango News Telugu

డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో మరో హిందూ నాయకురాలు చేరారు. భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్‌ను అమెరికా కొత్త నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు అయిన తులసి గబ్బార్డ్ అమెరికా తొలి హిందూ కాంగ్రెస్ మహిళగా గుర్తింపు పొందారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని యుద్ధ ప్రాంతాలకు వివిధ సందర్భాలలో తులసి గబ్బార్డ్ కూడా సైనికురాలిగా.. పనిచేశారు. తులసి కొంతకాలం క్రితం డెమొక్రాట్ పార్టీ వీడి ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీలో చేరారు.

2019లో డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ డిబేట్‌లో తులసి గబ్బర్డ్.. కమలా హారిస్‌ను ఓడించారు. కానీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో తులసి వెనుకబడ్డారు. 2022లో డెమోక్రటిక్ పార్టీని వీడి రిపబ్లికన్ పార్టీలో చేరగా..ఎన్నికల చర్చలో కమలా హారిస్‌ను ఓడించడానికి ట్రంప్ తులసి సహాయం కూడా కోరారు.

అమెరికాలో జన్మించిన తులసి గబ్బార్డ్ తల్లి భారతీయురాలు కాగా.. తండ్రి సమోవాన్ యూరోపియన్ సంతతికి చెందినవారు . అయితే హిందూమతం పట్ల ఆమె తండ్రికున్న ఆసక్తి కారణంగా వారు తమ కూతురికి తులసి అని పేరు పెట్టారు.

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తో పాటు.. మిలియనీర్ వ్యవస్థాపకుడు-రాజకీయవేత్త వివేక్ రామస్వామికి కూడా పెద్ద బాధ్యతలు ఇచ్చారు. మస్క్, రామస్వామి ప్రభుత్వ సమర్థత విభాగానికి లీడర్ షిప్ వహిస్తారని ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామి బయోటెక్ రంగంలో నిష్ణాతులు. ప్రభుత్వ అనుభవం లేకపోయినా కార్పొరేట్ రంగంలో అనుభవాన్ని వాడుకోవడంపై వివేక్ రామస్వామి దృష్టి సారించారు.

అంతే కాకుండా పీట్ హెగ్‌సేత్‌ను అమెరికా కొత్త డిఫెన్స్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ న్యూస్ హో, రచయిత పీట్ హెగ్‌సేత్‌ను డిఫెన్స్ సెక్రటరీ పదవికి ట్రంప్ ఎంపిక చేశారు. హెగ్‌సేత్‌ కూడా సైనికుడుగా పనిచేశారు. 44 ఏళ్ల పీట్ హెగ్‌సేత్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లో పోరాడిన సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ దేశ కొత్త అటార్నీ జనరల్‌గా ఫ్లోరిడాకు చెందిన మాట్ గేట్జ్‌ను ట్రంప్ ఎన్నుకున్నారు.