దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (కొత్త యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. యునైటెడ్ కింగ్ డమ్ నుండి భారత్ కు వచ్చిన ప్రయాణికుల్లో బుధవారం నాటికీ వరకు 20 మందికి పాజిటివ్ గా తేలగా, తాజాగా మరో ఐదుగురికి కొత్త రకం కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ గా తేలినట్టు ప్రకటించారు. ఇప్పటివరకు ఢిల్లీలోని ఎన్‌సీడీసీలో ఎనిమిది, బెంగళూరులోని నింహన్స్ ల్యాబ్ లో ఏడు, పూణేలోని ఎన్‌ఐవీలో ఐదు, హైదరాబాద్ లోని సీసీఎంబీలో రెండు, ఢిల్లీలోని ఐజీఐబీలో రెండు, కోల్‌కతాలోని ఎన్‌ఐబిఎంజిలో ఒక కేసు నిర్ధారణ అయినట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాజిటివ్ గా తేలిన వ్యక్తులందరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంచినట్టు తెలిపారు. అలాగే వారి తోటి ప్రయాణికులు, బంధువులు ఇలా కాంటాక్ట్ అయిన వాళ్లందరినీ కూడా క్వారంటైన్ లో ఉంచి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ