తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేసేందుకు నిర్ణయం

Telangana Govt Decided to Dovetail Aarogyasri with Ayushman Bharat Scheme,Mango News,Mango News Telugu,Telangana Dovetails Aarogyasri With Ayushman Bharat,Telangana Nod For Ayushman Bharat,To Be Dovetailed To Aarogyasri,Telangana To Adopt Ayushman Bharat Scheme,Hyderabad,Ayushman Bharat Scheme,Telangana Dovetails Arogyasri With Ayushman Bharat,Telangana Chief Minister K Chandrashekar Rao,Telangana Dovetail Aarogyasri With Ayushman Bharat Scheme,Telangana,Telangana News,Telangana Govt,Dovetail Aarogyasri with Ayushman Bharat Scheme,Ayushman Bharat Scheme News,Aarogyasri,Telangana Govt Latest News

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌ పథకంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానం చేయడానికి నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎస్ సోమేశ్ కుమార్ ఆయుష్మాన్ భారత్‌ పథకంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీకి తెలియజేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించిందని, తెలంగాణ రాష్ట్రంలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని సీఎస్ తెలిపారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 19 =