కేంద్రం కీలక నిర్ణయం, గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఆమోదం

COVID-19, Covid-19 Vaccination for Pregnant Women, Health ministry allows Covid-19 vaccination for pregnant, Mango News, Pregnant women in India now eligible for COVID-19 Vaccine, Pregnant women now eligible for Covid-19 vaccination, Pregnant Women Now Eligible for Covid-19 Vaccine, Pregnant women too can get Covid 19 vaccination, Union health ministry, Union Health Ministry Approved Covid-19 Vaccination for Pregnant Women, Vaccination of pregnant women approved

దేశంలో గర్భిణీలకు కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) సిఫారసుల ఆధారంగా గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే గర్భిణీ స్త్రీలు గర్భధారణ యొక్క ఏ సమయంలోనైనా దేశంలో అందుబాటులో ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్లను తీసుకోవచ్చని చెప్పారు. కోవిన్‌ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా లేదా నేరుగా వాక్-ఇన్ ద్వారా సమీప ప్రభుత్వ/ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ