అమెరికాలో 6.9 మిలియన్లకు పైగా కరోనా కేసులు, 2 లక్షలు దాటిన మరణాలు

US Coronavirus Death Count Crosses 2 Lakh Mark

అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో కరోనా వైరస్ వలన మరణించినవారి సంఖ్య 2 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు 2,01,880 మంది కరోనా వలన మరణించారు. అధికారక సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్(1,38,105) మరియు భారత్ (91,149) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు అమెరికాలో కరోనా బారినపడ్డ బాధితుల సంఖ్య 69,33,248 కు చేరుకుంది. అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో సైతం అమెరికానే మొదటి స్థానంలో కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu