దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకున్నాను. ఫలితం పాజిటివ్ గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది మరియు నాకు ఎటువంటి లక్షణాలు లేవు. వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్ లో ఉన్నాను. గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన వారంతా దయచేసి ఇతరులతో వేరుగా ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ