ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

Minister Perni Nani Press Meet Over Cabinet Meeting Decisions,Minister Perni Nani Press Meet,Minister Perni Nani,Perni Nani Speech,Perni Nani Press Meet,Perni Nani Latest Press Meet,Perni Nani Live,Perni Nani Latest News,Perni Nani Latest Speech,CM YS Jagan,Ap News,AP Latest News,YCP Political News,AP Political News,AP Govt,Mango News,Mango News Telugu,AP Minister Perni Nani Press Meet On AP Cabinet Decisions Live,Perni Nani Press Meet On AP Cabinet Decisions,Perni Nani,AP Cabinet Decisions,Perni Venkataramaiah,AP Minister Perni Venkataramaiah Press Meet,AP Minister Perni Nani,Perni Nani Press Meet Live,Minister Perni Nani Press Meet,YCP Perni Nani Press Meet,YSRCP Minister Perni Nani Press Meet,AP Minister Perni Nani Cabinet Press Meet

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం మరో విడత చెల్లింపులు, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీపై కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లించేందుకు ఆమోదం.
  • నివార్‌ తుపాను బాధిత రైతులకు డిసెంబర్ నెలాఖరులోగా పరిహారం చెల్లింపు.
  • మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా కింద 50 లక్షల 47 వేల మంది రైతులకు లబ్ది, డిసెంబర్ 29 న రైతుల ఖాతాల్లో రూ.1009 కోట్లు జమ.
  • ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్‌ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు ఆమోదం. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, మొత్తం రాష్ట్రంలో 27 మెడికల్‌ కాలేజీలకు రూ.16వేల కోట్ల నిధులు.
  • ఏపీ సమగ్ర భూ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం. సబ్‌ డివిజన్‌ ప్రకారం మ్యాప్‌ లు తయారీకి నిర్ణయం. మూడు సంవత్సరాల్లో భూ సర్వే పూర్తిచేసి భూహక్కు పత్రాలు జారీ.
  • హోటల్స్, రెస్టారెంట్స్, పర్యాటక రంగం రీస్టార్ట్‌ కోసం రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు రుణ సదుపాయం.
  • సినీ పరిశ్రమకు రీస్టార్ట్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం.
  • ఏపీ‌ పర్యాటక పాలసీకి ఆమోదం.
  • 6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలు.
  • తిరుపతిలో 40 ఎకరాల్లో భూమి సర్వే అకాడమీ ఏర్పాటు.
  • సినిమా థియేటర్లకు రుణాలు, వడ్డీపై రాయితీకి ఆమోదం.
  • చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డు నుంచి రూ.1931 కోట్ల రుణం తీసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అనుమతి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా జాస్తి నాగభూషణంను నియమిస్తూ నిర్ణయం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 12 =