ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సంస్కృతి మరియు పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల స్థితిగతులను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం నాడు సమీక్షించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఆయా మంత్రిత్వ శాఖల అధికారులు ఇరురాష్ట్రాలలో ప్రాజెక్టుల పురోగతి గురించి ఉపరాష్ట్రపతికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పని చేయడం ద్వారా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సూచించారు. జూలై 28న వెంకయ్య నాయుడును మంత్రి కిషన్ రెడ్డి కలసిన సందర్భంలో కూడా ఈ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న పనుల గురించి ఆయనకు వివరించించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఏర్పాటవుతున్న ప్రాజెక్టులు మరియు సంస్థలను త్వరగా పూర్తి చేయడానికి, పూర్తి స్థాయి కార్యాచరణకు వెంకయ్య నాయుడు క్రమం తప్పకుండా వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రెజెంటేషన్ సందర్భంగా, స్వదేశ్ దర్శన్ పథకం (కోస్టల్ సర్క్యూట్ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధ సర్క్యూట్, ఎకో సర్క్యూట్, తెలంగాణలో గిరిజన సర్క్యూట్ మరియు హెరిటేజ్ సర్క్యూట్) మరియు ప్రసాద్ పథకం కింద (ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి మరియు శ్రీశైలం ఆలయ అభివృద్ధి) పూర్తయిన ప్రాజెక్టుల గురించి అధికారులు వెంకయ్య నాయుడుకి వివరించారు. అలాగే రాష్ట్రాలలో అమలులో ఉన్న వివిధ దశల్లో ఉన్న ఇతర పర్యాటక సంబంధిత ప్రాజెక్టుల వివరాలను కూడా వారు వివరించారు.
ఇక కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రెజెంటేషన్ సందర్భంగా, వేయి స్తంభాల గుడి, హనుమకొండ, వీరభద్రేశ్వర స్వామి ఆలయం, లేపాక్షి, చార్మినార్, హైదరాబాద్ వంటి ప్రధాన పరిరక్షణ పనుల గురించి అధికారులు వెంకయ్య నాయుడుకు వివరించారు. మ్యూజియంలు, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, జోనల్ కల్చరల్ సెంటర్లు, లైబ్రరీలు మరియు ఇతర సంస్థలకు నిధుల కేటాయింపు మరియు ప్రాజెక్ట్‌లను కూడా వివరించారు. ప్రాజెక్టుల పురోగతి పట్ల అధికారులను ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రాజెక్టుల స్థలానికి క్రమం తప్పకుండా క్షేత్ర సందర్శనలు చేయాలని మరియు వాటిని వేగవంతం చేయడంలో వ్యక్తిగత చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వారికి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY