నిరవధిక వాయిదా పడిన పార్లమెంట్ ఉభయ సభలు.. నాలుగు రోజులు ముందే ముగిసిన సమావేశాలు

Parliament Monsoon Session Lok Sabha and Rajya Sabha Both Houses Adjourned Four Days Before Schedule, Lok Sabha and Rajya Sabha Both Houses Adjourned Four Days Before Schedule, Rajya Sabha House Adjourned Four Days Before Schedule, Lok Sabha House Adjourned Four Days Before Schedule, Parliament Monsoon Session, Monsoon Parliament Session, Monsoon Session, Lok Sabha and Rajya Sabha, Monsoon Parliament Session adjourned 4 days ahead of schedule, Monsoon Parliament session ends before schedule, Rajya Sabha, Lok Sabha, Monsoon Parliament Session adjourned, Parliament Monsoon Session News, Parliament Monsoon Session Latest News, Parliament Monsoon Session Latest Updates, Parliament Monsoon Session Live Updates, Mango News, Mango News Telugu,

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారంతో ముగిశాయి. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం కాకుండా నాలుగు రోజుల ముందే ముగియడం విశేషం. వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన 16 రోజుల తర్వాత నేడు ఉభయ సభలు (లోక్​సభ, రాజ్యసభ) సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. మరోవైపు ఉపరాష్ట్రపతిగా మరియు రాజ్య‌స‌భ చైర్మన్‌గా త‌న ప‌ద‌వీకాలం ముగిసిన నేప‌థ్యంలో.. స‌భ్యులంద‌రికీ వెంకయ్య నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ సహా ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా వెంకయ్య నాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా ఈ వర్షాకాల సమావేశాలు పలు కీలక ఘట్టాలకు వేదికయ్యాయి.

ఒకవైపు నూతన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లను ఈ సమావేశాల్లోనే సభ్యులు ఎన్నుకోగా, మరోవైపు ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై విపక్షాలు ఉభయ సభలలో నిరసనలు నిర్వహించాయి. ధరల పెరుగుదలపై ఉభయ సభల్లో స్వల్ప కాలిక చర్చ జరిపిన ప్రభుత్వం, కొన్ని కీలక బిల్లులు ఆమోదింపచేసుకుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సమావేశాల్లో మొత్తం ఏడు చట్టాలను ఆమోదించారని, 44 గంట‌ల 29 నిమిషాల పాటు స‌భా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయని పేర్కొనగా, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు 5 బిల్లులు స‌భ ఆమోదం పొందాయని, 38 గంట‌ల పాటు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే స‌భ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భర్తీ చేసిన‌ట్లు స్పీక‌ర్ బిర్లా ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + six =